Page Loader
IND Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. గాయంతో బంగ్లా కెప్టెన్ దూరం! 
టాస్ గెలిచిన ఆఫ్గాన్.. గాయంతో కెప్టెన్!

IND Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. గాయంతో బంగ్లా కెప్టెన్ దూరం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2023
01:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఇవాళ ఇండియా, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా ఈ మ్యాచులో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ వరుసగా రెండు ఓటములను చవిచూసింది. కెప్టెన్ షకీబుల్ హసన్ న్యూజిలాండ్ తో మ్యాచులో గాయపడటంతో ఈ మ్యాచుకు దూరమయ్యాడు. ఇక ఇండియాపై ఎలాగైనా గెలవాలని బంగ్లాదేశ్ భారీగానే కసరత్తు చేస్తోంది.

Details

ఇరు జట్లలోని సభ్యులు

భారత్ జట్టు రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బంగ్లాదేశ్ జట్టు లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం