
BAN Vs SL : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. తుది జట్లు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతోంది.
ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఈ ఇరు జట్ల ఆటతీరు అంతంత మాత్రంగానే ఉంది.
ఇప్పటివరకూ ఈ రెండు జట్లు ఏడు మ్యాచులు ఆడాయి. ఇందులో శ్రీలంక రెండింట్లో, బంగ్లాదేశ్ ఒకదాంట్లో విజయం సాధించింది.
ఇక మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవడం తప్ప సెమీస్ చేరడానికి ఇరు జట్లకు అవకాశాలు లేవు.
ఈ మ్యాచులో బంగ్లాదేశ్ ఒక మార్పు చేయగా, శ్రీలంక రెండు మార్పులను చేసింది.
Details
ఇరు జట్లలోని సభ్యులు
బంగ్లాదేశ్ జట్టు
తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్(c), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం
శ్రీలంక జట్టు
పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, కసున్ రజిత, దిల్షన్ మధుశంక