Page Loader
Jasprit Bumrah: గాయంతో పోరాడినా, ఫలితం నిరాశను మిగిల్చింది : బుమ్రా
గాయంతో పోరాడినా, ఫలితం నిరాశను మిగిల్చింది : బుమ్రా

Jasprit Bumrah: గాయంతో పోరాడినా, ఫలితం నిరాశను మిగిల్చింది : బుమ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోయింది. సిడ్నీ టెస్టులో ఆసీస్ విజయం సాధించడంతో పదేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత పేసర్ జస్పిత్ బుమ్రా సిరీస్‌లో అత్యధిక 32 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా బౌలింగ్ చేయలేకపోయిన బుమ్రా, తన గాయం గురించి స్పందించారు. ఫలితం నిరాశను కలిగించిందని, అయితే కీలక సమయాల్లో బౌలింగ్ చేయలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. శరీరాన్ని గౌరవించడం ముఖ్యమని, అది బాగుంటేనే తాము ముందుకెళ్లగలమని చెప్పారు.

Details

ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకం : కమిన్స్

మొదటి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు వెన్నునొప్పి అనిపించిందన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్ల పోరాటం సరిపోలేదని, కుర్రాళ్లు ఈ సిరీస్‌లో మంచి అనుభవం పొందారని తెలియజేశారు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడారు. ఈ విజయం తమకు అద్భుతంగా అనిపిస్తోందని, మొదటి మ్యాచ్‌లో ఓడినా, ఆటగాళ్లు గొప్ప పోరాటం చూపించారన్నారు. ఈ సిరీస్ తన కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమన్నారు. అభిమానులు ఈ సిరీస్‌ను మరింత ప్రత్యేకంగా చేశారని చెప్పారు.