IND vs ENG: బీసీసీఐ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌తో మిగిలిన 3 టెస్టులకు కూడా కోహ్లీ దూరం
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం టీమిండియా జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీ తెలిపింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వీరు ఆడుతారా? లేదా? అనేది వారి మెడికల్ రిపోర్డు, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బోర్డు పేర్కొంది. సిరీస్‌లోని మూడో టెస్టు ఫిబ్రవరి 15నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది. అదే సమయంలో నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో, ఐదో టెస్ట్ మ్యాచ్ మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.
ఆకాష్ దీప్‌కు అవకాశం
చివరి మూడు టెస్టుల కోసం ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చాడు. బిహార్‌లోని రోహతాస్ జిల్లాకు చెందిన ఆకాష్ దీప్ ఇప్పుడు జట్టులో భాగమయ్యాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆకాశ్ దీప్ 103 వికెట్లు తీశాడు. అదే సమయంలో టీ20లో అతని పేరిట 48 వికెట్లు ఉన్నాయి. భారత జట్టు ఇదే.. రోహిత్ శర్మ(కెప్టెన్), బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్), కెఎస్ భరత్ (వికెట్), అశ్విన్, జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.