BCCI : బీసీసీఐ సంచలన ప్రకటన.. టీమిండియా స్పిన్ కోచ్‌గా బహుతులె
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు మరో కొత్త కోచ్‌ను తీసుకుంది. కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ సాయిరాజ్ బహుతులేను నియమిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో ఇప్పటివరకు ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ కోచ్ లేకపోవడం గమనించాల్సి విషయం. అయితే ఆ లోటును భర్తీ చేస్తూ బీసీసీఐ ఈ బాధ్యతలను సాయిరాజ్‌కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
వివరాలు
కొత్త కోచ్ ట్రాక్ రికార్డు ఇదే..
ఆటగాడిగా, కోచ్‌గా ఎంతో అనుభవం ఉన్న 53 ఏళ్ల బహుతులే రాకతో భారత స్పిన్ విభాగం చాలా దృఢంగా తయారు కానుంది. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ స్పిన్నర్లను అద్భుతంగా తీర్చిదిద్దిన ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉండటంతో ఇకపై సరికొత్త స్పిన్ విభాగాన్ని టీమిండియాలో చూడొచ్చు. గతంలో అండర్-19, ఇండియా-ఎ జట్లతో కలిసి ఆయన పనిచేశారు. బహుతులె ఇప్పటి వరకూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 630 వికెట్లు తీయగా.. 6176 పరుగులు చేశారు. రెండు టెస్టుల్లో, 8 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఆయనకు ఉంది.