Loading...
Rohit Sharma Virat Kohli 2027 World Cup: రోహిత్‌, విరాట్‌లపై బీసీసీఐ కీలక నిర్ణయం
రోహిత్‌, విరాట్‌లపై బీసీసీఐ కీలక నిర్ణయం

Rohit Sharma Virat Kohli 2027 World Cup: రోహిత్‌, విరాట్‌లపై బీసీసీఐ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 20, 2026
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఆడతారా? న్యూజిలాండ్‌ పర్యటన తర్వాత మొదలైన ఈ చర్చకు బీసీసీఐ నుంచి కీలక సంకేతం వచ్చినట్లు తెలుస్తోంది. ఫామ్‌తో సంబంధం లేకుండా ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్లను ప్రపంచకప్‌ ప్రణాళికల్లో కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు దైనిక్‌ జాగ్రన్‌ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో జరిగే మెగా టోర్నీలో వారి అనుభవం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని బోర్డు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇటీవల వచ్చిన రిటైర్మెంట్‌ ఊహాగానాలకు కొంతమేర బ్రేక్‌ పడినట్టైంది.

Details

న్యూజిలాండ్‌లో రోహిత్‌ ఫెయిల్‌.. విరాట్‌ పరిస్థితి ఇదే

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేసిన హిట్‌మ్యాన్‌.. రెండుసార్లు డకౌట్‌ అయ్యాడు.

దీంతో 2027 ప్రపంచకప్‌ సమయానికి రోహిత్‌ జట్టులో ఉంటాడా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

విరాట్‌ కోహ్లీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి వన్డేలో 74 పరుగులు చేసిన విరాట్‌.. తర్వాత మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 పరుగులే చేశాడు.

అయినప్పటికీ నాలుగు మ్యాచ్‌ల్లో 86 పరుగులతో భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Details

దక్షిణాఫ్రికాలో విరాట్‌ రికార్డు అదుర్స్

2027 ప్రపంచకప్‌ అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది.

దక్షిణాఫ్రికా గడ్డపై విరాట్‌ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ 20 వన్డేలు ఆడిన విరాట్‌ 76.38 సగటుతో 993 పరుగులు చేశాడు.

ఇందులో మూడు సెంచరీలు, ఆరు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో తన అత్యుత్తమ సగటును కూడా విరాట్‌ దక్షిణాఫ్రికాలోనే నమోదు చేశాడు.

అందుకే ఆ దేశంలోని పరిస్థితులు, పిచ్‌లపై అతనికి ఉన్న అనుభవం భారత జట్టుకు కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.

ADVERTISEMENT

Details

రోహిత్‌ రికార్డు మాత్రం పూర్తి భిన్నం

దక్షిణాఫ్రికాలో రోహిత్‌ శర్మ గణాంకాలు మాత్రం విరాట్‌తో పోలిస్తే అంతగా ఆకట్టుకోవు. అక్కడ 14 వన్డేలు ఆడిన రోహిత్‌ 19.69 సగటుతో 256 పరుగులు చేశాడు.

ఇందులో ఒక సెంచరీ ఉంది. 2018లో దక్షిణాఫ్రికాపై చేసిన 115 పరుగులను పక్కన పెడితే.. మిగిలిన 13 మ్యాచ్‌ల్లో 12 ఇన్నింగ్స్‌లలో కలిపి అతని ఖాతాలో 141 పరుగులే ఉన్నాయి.

అయినా ఇద్దరు సీనియర్ల అనుభవం, ప్రపంచకప్‌ ప్రాధాన్యత దృష్ట్యా బీసీసీఐ వారిపై నమ్మకం కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే 2027 వరకు వారి ఫామ్‌, ఫిట్‌నెస్‌ కూడా కీలక అంశాలుగా మారనున్నాయి.

ADVERTISEMENT