యువ ఆల్‌రౌండర్లను సానబట్టే పనిలో నిమగ్నమైన బీసీసీఐ
ప్రతిభావంతులైన 20 మంది యువ ఆల్ రౌండర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మూడు వారాల పాటు వారందరికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గోవా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ ఇటీవల ముంబై తరుపున అరంగ్రేటం చేసిన అర్జున్ టెండుల్కర్ కి ఈ జాబితాలో స్థానం లభించడం విశేషం. ఈ ఏడాది ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీ జరగనుంది. అయితే సామర్థ్యం గల యువ ఆల్ రౌండర్లను ఎంపిక చేయాలని బీసీసీఐ ప్రణాళికలను రచిస్తోంది. ఆల్ రౌండర్లకు శిక్షణ ఇవ్వాలని మొదట ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. టెస్టు, వన్డే, టీ20లకు తగ్గట్టుగా ఆటగాళ్లకు నైపుణ్యాన్ని మెరుగుపరచడమే ఈశిబిరం ముఖ్య ఉద్ధేశమని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు.
యువ ఆటగాళ్లకు మంచి ఛాన్స్
అర్జున్, చేతన్ సకారియా, అభిషేక్‌శర్మ, మోహిత్ రెడ్కర్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, దివిజ్ మెహ్రాల సహా 20 మంది ఆల్‌రౌండర్ల జాబితాలో ఉన్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నేపథ్యంలో టీమ్ ఇండియా నెట్ బౌలర్‌గా పేసర్ హర్షిత్ ను ఇంగ్లండ్ ను పంపించాలని బీసీసీఐ భావించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అతని స్థానంలో ఆంధ్రా పేసర్ యర్రా పృథ్వీరాజ్ ను పంపించారు. యువ ఆలౌ రౌండర్లు ఇది మంచి అవకాశమని మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. యువ ఆల్ రౌండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో టీమిండియా తరుపున మెరుగ్గా రాణించాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.