Page Loader
రవిచంద్రన్ అశ్విన్ మాములోడు కాదు.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్!
అంపైర్లతో అశ్విన్ వాగ్వివాదం

రవిచంద్రన్ అశ్విన్ మాములోడు కాదు.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2023
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం సేలం స్పార్టాన్స్, చెపాక్ సూపర్ గిల్లీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో సేలం కెప్టెన్ అభిషేక్ తన్వార్ ఒకే బంతికి 18 పరుగులిచ్చి చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే సవాల్ చేస్తూ డీఆర్ఎస్ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో దిండిగల్ డ్రాగాన్స్ జట్టుకు అశ్విన్ నాయకత్వం వహించాడు. బాల్సీ ట్రిచీ జట్టుతో జరిగిన మ్యాచులో ఓ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్నే అశ్విన్ సవాల్ చేశాడు.

Details

నిరాశ చెందిన అశ్విన్

అశ్విన్ బౌలింగ్‌లో బాల్సీ ట్రిచీ బ్యాటర్ రాజకుమార్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. సౌండ్ రావడంతో అశ్విన్ గట్టిగా అప్పిల్ చేశాడు. దీంతో అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. వెంటనే బ్యాటర్ రివ్యూ కోరాడు. రివ్యూలో స్త్పెక్ కనిపించినా బ్యాట్ నేలకు తాకడం వల్ల సౌండ్ వచ్చిందని దాన్ని నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో అసహనానికి గురైన అశ్విన్ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్లీ డీఆర్ఎస్‌కు వెళ్లాడు. మరోసారి టీవీలో పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌట్ గా ధ్రువీకరించాడు. దీంతో అశ్విన్ నిరాశ చెందాడు. అయితే బిగ్ స్క్రీన్ పై చూసిన తర్వాత అది ఔట్ అని తాను భావించానని అశ్విన్ పేర్కొన్నారు.