విండీస్ టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన బీసీసీఐ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. వచ్చే డబ్ల్యూటీసీ(2023-25) కోసం తమ పోరును కొత్తగా ప్రారంభించనుంది. భారత జట్టు జూలై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.
ఇందులో భాగంగా టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచులను ఆడనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ సోమవారం ప్రకటించింది. నెల రోజుల విరామం తర్వాత భారత జట్టు వెస్టిండీస్‌తో తలపడనుంది.
జులై 12 నుంచి మొదలయ్యే ఫస్ట్ టెస్టుతో భారత పర్యటన మొదలవుతుంది. ఆగస్టు 13న జరిగే చివరి టీ20తో పర్యటన ముగియనుంది.
Details
టీమిండియా-వెస్టిండీస్ షెడ్యూల్ ఇదే
జులై 12-16 : తొలి టెస్టు - డొమినికా
జులై 20 - 24 : రెండో టెస్టు : ట్రినిడాడ్
జులై 27 : తొలి వన్డే - బార్బోడస్
జులై 29 : రెండో వన్డే - బార్బోడస్
ఆగస్టు 1 : మూడో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 3 : తొలి టీ20 - ట్రినిడాడ్
ఆగస్టు 6 : రెండో టీ20 - గయానా
ఆగస్టు 8 : మూడో టీ20 - గయానా
ఆగస్టు 12 : నాలుగో టీ20 - ఫ్లోరిడా (యూఎస్)
ఆగస్టు 13 : ఐదో టీ20 - ఫ్లోరిడా
వెస్టిండీస్ తో జరిగే టీ20 మ్యాచులకు యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలని బోర్డు ఆలోచిస్తోంది.