Page Loader
సీనియర్లపై మండిపడ్డ గవాస్కర్.. వరల్డ్ కప్ గెలిచే మొఖాలేనా ఇవి?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

సీనియర్లపై మండిపడ్డ గవాస్కర్.. వరల్డ్ కప్ గెలిచే మొఖాలేనా ఇవి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 12, 2023
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

డబ్య్లూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. టీమిండియా ఆటగాళ్లు ఔట్ అయిన విధానంపై సీనియర్లు మండిపడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు ఛేజ్ చేసే క్రమంలో ఆరంభంలోనే భారత్ శుభ్‌మన్ వికెట్ కోల్పోయింది. అయితే కెప్టెన్ రోహిత్ ఫార్మ్ లో కనిపించినా తనపై ఆశలు పెట్టుకోవడం తప్పు అని రోహిత్ మళ్లీ ప్రూవ్ చేశాడు. లియాన్ బౌలింగ్‌లో పరమ చెత్త షాట్ ఆడి పెవిలియానికి చేరాడు. ఇక కౌంటీల్లో విజృంభించినా పుజారా అత్యంత దారుణంగా నిరాశపరిచాడు. విరాట్ కోహ్లీ ఐదో రోజు ఆట మొదలైన కాసేపటికే ఔట్ అయ్యాడు. ఆఫ్‌స్టంప్‌కు దూరంగాపడిన బంతిని డ్రైవ్ చేయబోయు స్లిప్స్‌లో క్యాచ్ ఇచ్చాడు.

Details

డబ్య్లూటీసీ ఫైనల్ లో ఎలా ఆడాలో టీమిండియాకు తెలియడం లేదు

వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కాసేపు ఆడినట్లే కనిపించినా అవతలి ఎండ్‌లో వికెట్లు పడటంతో డిఫెన్స్ ఆడబోయాడు. ఈ క్రమంలో అతను పెవిలియన్ చేరడంతో భారత్ పోరాటం ముగిసింది. సీనియర్ ప్లేయర్లు చెత్త షాట్ ను ఎంపిక చేసుకొని ఔట్ అయ్యారని టీమిండియా మాజీ ప్లేయర్లు విమర్శించారు. ముఖ్యంగా సునీల్ సీనియర్ల పై ఘాటు వ్యాఖ్యలను చేశాడు. డబ్య్లూటీసీ ఫైనల్ వంటి మ్యాచులో ఎలా ఆడాలో టీమిండియా సీనియర్ ప్లేయర్లకు తెలియడం లేదని, పరమ చెత్త షాట్‌తో వికెట్లు చేజార్చుకున్నారని అతను పేర్కొన్నారు. టీమిండియా ఇలాగైతే ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవదని ఫ్యాన్స్ చెబుతున్నారు.