Mohammed Shami: షమీకి బీసీసీఐ రెండు కండీషన్లు.. డెడ్‌లైన్‌లోగా వాటిని అందుకొంటేనే ఆసీస్ ఫ్లైట్
భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పునరాగమనంపై రోజుకో కొత్త వార్తలు వెలువడుతున్నాయి. రెండో టెస్టు నాటికి అతడు ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని అందరూ ఊహించారు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడి మెరుగైన ప్రదర్శనతో, అతడు జట్టులో తిరిగి వచ్చేస్తాడని భావించారు. అయితే, బీసీసీఐ ఈ విషయంలో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. తాజాగా, బీసీసీఐ అతనికి రెండు షరతులు పెట్టిందని వార్తలు వచ్చాయి. బీసీసీఐ వైద్య బృందం షమీని పర్యవేక్షిస్తూ అతడి ఫిట్‌నెస్ స్థాయిని పరిశీలిస్తోంది.షమీ పునరాగమనానికి గాను రంజీ ట్రోఫీ,సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచుల్లో అతడి బౌలింగ్‌పై బోర్డు దృష్టిపెట్టింది. కానీ, టీ20ల్లో కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్ ఆధారంగా అతడి ఫిట్‌నెస్‌పై నిర్ణయం తీసుకోవడం సరికాదు.
ఆస్ట్రేలియా ప్రైమ్‌మినిస్టర్‌తో భారత జట్టు
బీసీసీఐ చట్టాల ప్రకారం, షమీ డిసెంబర్ రెండో వారంలోపే రెండు ముఖ్యమైన షరతులను పాస్ అవ్వాల్సిందే. అలా జరిగితే, డిసెంబర్ 14న ఆస్రేలియాతో జరిగే మూడో టెస్టు నాటికి అతడు జట్టుతో చేరే అవకాశం ఉంది. వచ్చే శనివారం, ఆదివారం భారత జట్టు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XI జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్‌ను కాన్‌బెర్రా పార్లమెంట్ హౌస్‌లో కలిశారు.