Page Loader
బీసీసీఐకి అహంకారం.. అందుకే ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వడం లేదు
బీసీసీఐపై విమర్శలు చేసిన ఇమ్రాన్ ఖాన్

బీసీసీఐకి అహంకారం.. అందుకే ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వడం లేదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 01, 2023
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి బీసీసీఐపై నిందలు వేశారు. పాక్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడకపోవడంపై ఇమ్రాన్ ఖాన్ స్పందించాడు. ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లను బ్యాన్ చేయడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టైమ్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. అంతులేని సంపదతో బీసీసీఐ అహంకారంగా, దురుసుగా ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. 2008లో జరిగిన ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో పాక్ ఆటగాళ్లు భాగమయ్యారని, అయితే ఆ ఏడాది చివర్లో ముంబైలో జరిగిన ఉగ్రదాడులు రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను పెంచాయని ఆయన గుర్తు చేశాడు.

పాక్

2008 ఐపీఎల్‌లో పాక్ క్రికెటర్లు ఆడారు

పాకిస్థాన్, భారత్ ల మధ్య సంబంధాలు దిగజారడం అన్యాయమని, ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ ఉన్న భారత్ చాలా అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఎవరు ఆడాలి, ఎవరు ఆడకూడదని కూడా భారత్ నిర్ణయించడంపై ఆయన విమర్శించారు. 2008 లో తొలి ఐపీఎల్ సీజన్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు ఆడారని, ముంబైలో టెర్రరిస్టులు దాడులు జరిగాయని దీంతో పాక్, ఇండియా సంబంధాలు దారుణ స్థాయికి దిగజారాయని పేర్కొన్నారు.