తదుపరి వార్తా కథనం

BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 16, 2025
03:28 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా ప్రముఖ సంస్థ 'అపోలో టైర్స్'ను జెర్సీ స్పాన్సర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాబోయే అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత ఆటగాళ్ల జెర్సీలపై అపోలో టైర్స్ లోగో కనిపించనుంది. ఈ ఒప్పందం2027 వరకు అమల్లో ఉంటుందని బీసీసీఐ వెల్లడించనుంది. ఒక్కో మ్యాచ్ కోసం అపోలో టైర్స్ బీసీసీఐకి రూ.4.5 కోట్లు చెల్లించనుంది ప్రస్తుతం టీమ్‌ఇండియా అనేక కీలక టోర్నీలకు సిద్ధమవుతుండగా, కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ రావడం ప్రత్యేకతగా మారింది.