
Team India: బీసీసీఐ షాకింగ్ డెసిషన్.. కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో బరిలోకి దిగనుంది.
ప్రస్తుతం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబంతో విహార యాత్రలో ఉన్నప్పటికీ, పర్యటనకు ముందు టీమిండియా సహాయక సిబ్బందిలో బీసీసీఐ భారీ మార్పులు చేయనుందని వార్తలు వస్తున్నాయి.
మార్చి 29న గువాహటిలో సమావేశం
ఈ మార్పులపై నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మార్చి 29న గువాహటిలో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో సహాయక సిబ్బందిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Details
కొత్త అసిస్టెంట్ కోచ్‌లకు అవకాశం
రాహుల్ ద్రవిడ్ తర్వాత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్‌కు ఇప్పటికే రైన్ టెన్ డస్కతే, అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు.
మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతున్నారు. బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్ వ్యవహరిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో ఈ సిబ్బంది కీలక పాత్ర పోషించారు.
Details
భారీ మార్పులపై బీసీసీఐ ఫోకస్
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో భారీ సిబ్బందిని పంపించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపడం లేదు.
దీంతో అభిషేక్ నాయర్, దిలీప్‌ను పక్కన పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అయితే, సితాన్షు కోటక్, మోర్నీ మోర్కెల్ పదవులకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
గంభీర్ నిర్ణయం ఆసక్తికరం
గౌతమ్ గంభీర్ అసిస్టెంట్ కోచ్‌లు కొనసాగించాలని డిమాండ్ చేస్తే, బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో క్రికెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.