
పంజాబ్ పై గెలిచినా కేకేఆర్ జట్టు కెప్టెన్ కు షాకిచ్చిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. అయితే ఆ జట్టు కెప్టెన్ నితీశ్ రాణాకు బీసీసీఐ షాకిచ్చింది.
స్లో ఓవర్ రేట్ కారణంగా నితీశ్ కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ అనేది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుంది.
దీంతో అతనికి రూ.12లక్షలు ఫైన్ వేశారు. ఇప్పటివరకూ 11 మ్యాచ్లు ఆడిన కేకేఆర్, ఐదు మ్యాచ్ లు గెలిచి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది.
సోమవారం కేకేఆర్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠంగా సాగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. రింకూ సింగ్ బౌండరీ కొట్టి కేకేఆర్ కు విజయాన్ని అందించాడు.
Details
కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు సజీవం
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 47 బంతుల్లో 57 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
షారుక్ ఖాన్ చివరి 8 బంతుల్లో 21 పరుగులతో విజృంభించాడు. కేకేఆర్ తరుపున వరుణ్ చక్రవర్తి మరోసారి 3 వికెట్లతో సత్తా చాటాడు.
లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి విజయం సాధించింది.
కెప్టెన్ నితీష్ రాణా 38 బంతుల్లో 51 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 23 బంతుల్లో 42 పరుగులతో చెలరేగాడు. ఈ విజయంలో కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.