LOADING...
MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా! 
శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా!

MI vs PBKS : శ్రేయస్-హార్దిక్‌లకు బీసీసీఐ షాక్‌.. ఇద్దరికి బారీ జరిమానా! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు అదరగొడుతోంది. క్వాలిఫయర్ -2లో ముంబయి ఇండియన్స్‌పై ఘన విజయం సాధించి, ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. తిలక్ వర్మ (44), సూర్యకుమార్ యాదవ్ (44) అద్భుతంగా రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా రెండు వికెట్లు తీయగా, జేమీసన్, విజయ్ కుమార్ వైశాక్, చాహల్ తలతా ఒకొక్క వికెట్ సాధించారు.

Details

రాణించిన అయ్యర్

తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87 నాటౌట్ - 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు), నేహల్ వధేరా (48 - 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో 19 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పంజాబ్ జట్టు ఫైనల్‌లోకి చేరినా, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలపై బీసీసీఐ జరిమానాలు విధించింది. ఇరు జట్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం కారణంగా ఈ చర్య తీసుకున్నారు.

Details

శ్రేయస్ అయ్యర్‌కు రూ. 24 లక్షలు

ఈ సీజన్‌లో ఇది రెండోసారి పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేట్ చేసిన కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించారు. అలాగే ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌కి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (దానిలో తక్కువదానిని) జరిమానాగా విధించనున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఈ సీజన్‌లో మూడోసారి ఉల్లంఘించడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించారు. మిగిలిన ఆటగాళ్లకు, ఇంపాక్ట్ ప్లేయర్‌కు రూ. 12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (దానిలో తక్కువదానిని) జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.