Page Loader
Ben Stokes: ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా
ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడనున్న బెన్ స్ట్సోక్

Ben Stokes: ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2023
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైన్నై సూర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి, అభిమానులకు గుడ్ న్యూస్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్సోక్ ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ టెస్టు నేపథ్యంలో ఐపీఎల్ చివరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అతనికి ఇంగ్లండ్ యాజమాన్యం ఐపీఎల్ ఆడటానికి ఎన్ఓసీ ఇచ్చింది. మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ.. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి తాను ఆడేందుకు సిద్ధం అవుతుతానని ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ చెప్పాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో సీఎస్‌కే స్టోక్స్‌ను 16.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

బెన్ స్టోక్స్‌

ఐపీఎల్‌లో బెన్ స్టోక్స్‌కు అద్భుత రికార్డు

వెల్లింగ్టన్ టెస్టులో ఇంగ్లాండ్ ఒక్క పరుగు తేడాతో ఓడిన అనంతరం స్టోక్స్ మీడియాతో మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో తన శరీర పరిస్థితి గురించి మాట్లాడానని చెప్పాడు. రాబోయే వారాల్లో ఫిట్‌నెస్ సాధించే విషయమై శ్రద్ధ పెడతానన్నాడు. తనకు నచ్చిన విధంగా ఆటతీరు కనబర్చలేకపోవడం ఫ్రస్టేషన్ కు గురి చేసిందన్నారు. స్టోక్స్ 43 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 920 పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో 28 వికెట్లు పడగొట్టాడు. 2018-21లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లో ఆడాడు. గతేడాది ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌గా జో రూట్‌ స్థానంలో స్టోక్స్‌ 12 టెస్టుల్లో 10 విజయాలు సాధించాడు.