Ben Stokes: వన్డే క్రికెట్‌లో బెన్ స్టోక్స్ సాధించిన అరుదైన రికార్డులివే!
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ వన్డేల్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుతున్నాడు. 2022 జులైలో వన్డేలకు గుడ్ బై చెప్పిన స్టోక్స్.. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే క్రికెట్‌లోకి రీఎంట్రీ చెలరేగిపోతున్నాడు. మొదటి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన స్టోక్స్, మూడో వన్డేల్లో శివాలెత్తిపోయాడు. 124 బంతుల్లోనే 182 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తరుపున అత్యధిక స్కోరు సాదించిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అయితే వన్డేల్లో స్టోక్స్ సాధించిన రికార్డుల గురించి ఓసారి తెలుసుకుందాం. 2019లో న్యూజిలాండ్ పై 242 పరుగులు చేధించే క్రమంలో ఇంగ్లండ్ 86 పరుగులకే నాలుగు వికెట్లు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన స్టోక్స్ 84* పరుగులతో అజేయంగా నిలిచి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.
2017లో సౌతాఫ్రికాపై శతకం బాదిన స్టోక్స్
2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మినహా అన్ని గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 337/7 భారీ స్కోరు చేసింది. స్టోక్స్ 54 బంతుల్లో 79 పరుగులతో తన వంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ను 306/5కి పరిమితం చేయడంతో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2017లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో ఇంగ్లండ్ 80/3స్కోరు చేసి కష్టాల్లో పడింది. అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన స్టోక్స్ కేవలం 79 బంతుల్లో 101 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 330/6 స్కోర్ చేసింది. ఆ మ్యాచులో ఇంగ్లండ్ రెండు పరుగుల తేడాతో గెలుపొందింది.
2017లో దక్షిణాఫ్రికాపై 102 పరుగులు చేసిన స్టోక్స్
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాపై 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 35 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. అయితే స్టోక్స్ 109 బంతుల్లో 102 పరుగులు చేసిన అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచులో ఇంగ్లండ్ 40 పరుగుల తేడాతో గెలిచింది.