24 పరుగుల తేడాతో బెంగళూర్ ఘన విజయం
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి బెంగళూర్ 174 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ అర్ధ శతకాలతో విజృంభించారు. లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ 18.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. దీంతో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 24 పరుగుల తేడాతో గెలుపొందింది. కోహ్లీ 47 బంతుల్లో 59 పరుగులు, డుప్లెసిస్ 56 బంతుల్లో 84 పరుగులు చేయడంతో బెంగళూర్ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో మాక్సెవెల్(0), దినేష్ కార్తీక్(7) విఫలమయ్యారు.
విజృంభించిన బెంగళూర్ బౌలర్లు
పంజాబ్ బౌలర్లలో హర్మత్ బార్ 2, అర్షదీప్, సామ్ కర్రన్ తలా ఓ వికెట్ తీశారు. లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అథర్వ తైదే(4) ను మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్యూ చేశాడు. చేశాడు. ఎన్నో ఆశలతో బరిలోకి మాథ్యూ షార్ట్( 8), లివింగ్ స్టోన్ (2) నిరాశ పరచడంతో పంజాబ్ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రభుమాన్ సింగ్(46), జితేష్ శర్మ(41) పరుగులతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. బెంగళూర్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4, హసరంగ 2, పార్నవెల్, హర్షద్ పటేల్ తలా ఓ వికెట్ తీశారు.