Rohit Sharma: రోహిత్ శర్మకు 'బెస్ట్ ఫీల్డర్ మెడల్'.. ప్రొఫెసర్ అంటూ కోచ్ కితాబు
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్లుతోంది. ఈ మెగా టోర్నీలో ఏడు విజయాలతో జోరుమీదున్న రోహిత్ సేన ఆదివారం దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచులో జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. ఈసారి బెస్ట్ ఫీల్డర్ అవార్డును హిట్ మ్యాన్‌ను వరించింది. ఈ మెడల్ కోసం సూర్యకుమార్, రాహుల్, జడేజా, రోహిత్ పోటిపడ్డాడు. బెస్ట్ ఫీల్డర్ అవార్డుకు ముందు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అతడిని ప్రొఫెసర్ అని పిలుస్తానని, మైదానంలో సరైన ఎత్తుగడలతో ఫీల్డర్లను మోహరిస్తాడని, కేవలం క్యాచులు పట్టడమే కాదని, మైదానంలో కూడా చురుగ్గా ఉంటాడని దిలీప్ ప్రకటించాడు.
తొలిసారి బెస్ట్ ఫీల్డర్ అవార్డును గెలుచుకున్న రోహిత్
అనంతరం టీమ్ సభ్యులు గ్రౌండ్‌లోకి వచ్చాక, అక్కడ బగ్గీ కెమెరా రోహిత్ వైపు తిరిగింది. దీంతో జట్టు సభ్యులను చప్పట్లు కొడుతూ హిట్ మ్యాన్ ను అభినందించారు. ఈ మెడల్‌ను శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మాత్రమే రెండుసార్లు గెలిచారు. ఇక మొదటి మెడల్‌ను ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఫీల్డింగ్ చేసి విరాట్ కోహ్లీ అందుకున్న విషయం తెలిసిందే.