Page Loader
IPL 2025:చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్!.. అత్యంత విజయవంతమైన పేసర్‌గా..
చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్!.. అత్యంత విజయవంతమైన పేసర్‌గా..

IPL 2025:చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్!.. అత్యంత విజయవంతమైన పేసర్‌గా..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాంఖడే స్టేడియంలో ముంబైలో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 సీజన్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఈ గెలుపులో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి బ్యాటర్లు అద్భుతంగా ఆడి కీలక పాత్ర పోషించగా, భువనేశ్వర్ కుమార్ తన బౌలింగ్‌తో మరింత మెరిశాడు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ ఒక ఐపీఎల్ చరిత్రాత్మక రికార్డును తిరగరాసి సంచలనం సృష్టించాడు. ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొత్త మైలురాయిని సాధించాడు.

వివరాలు 

ఉత్కంఠభరితంగా  మ్యాచ్ 

ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే దెబ్బతింది. అయితే హార్దిక్ పాండ్యా,తిలక్ వర్మ తమ శక్తివంచన లేకుండా పోరాడారు. చివరికి మాత్రం మ్యాచ్‌ను ఆర్సీబీ తమ ఖాతాలో వేసుకుంది. భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి తిలక్ వర్మను ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తిలక్ వర్మ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. కానీ అతను ఔటైన తర్వాత మ్యాచ్ దిశ మళ్లిపోయింది. భువనేశ్వర్ వికెట్ తీసిన వెంటనే విరాట్ కోహ్లీ ఆనందంగా కనిపించాడు.

వివరాలు 

ఫాస్ట్ బౌలర్ల విభాగంలో టాప్ 5 

ఈ విజయంతో పాటు భువనేశ్వర్ కుమార్ తన ఐపీఎల్ కెరీర్‌లో 184 వికెట్లను తీసి, డ్వేన్ బ్రావో (183 వికెట్లు) రికార్డును అధిగమించాడు. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నప్పటికీ, అతను ఇంకా వెనకనే ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో టాప్ 5 ఇలా ఉన్నాయి: భువనేశ్వర్ కుమార్ - 184 వికెట్లు డ్వేన్ బ్రావో - 183 వికెట్లు లసిత్ మలింగ - 170 వికెట్లు జస్ప్రీత్ బుమ్రా - 165 వికెట్లు ఉమేష్ యాదవ్ - 144 వికెట్లు

వివరాలు 

నాలుగు వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా 

ఇక ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 6 ఓటములు ఎదుర్కొన్న ఆర్సీబీ ముంబైపై తొలి విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఆరంభంలోనే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓపెనర్లు రోహిత్ శర్మ (17)ర్యాన్ రికెల్టన్ (17) పవర్ ప్లేలో పెవిలియన్ చేరగా,విల్ జాక్స్ (12), సూర్యకుమార్ యాదవ్ (28) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 42 పరుగులు చేసి భారీ ప్రదర్శన చేశాడు.తిలక్ వర్మ 29 బంతుల్లో 56 పరుగులు చేయడం విశేషం. అయితే వారు త్వరగానే ఔటవ్వడంతో ముంబై పోరాటం విఫలమైంది. ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీసి మెరిశాడు.యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.