
ఆసియా బ్యాడ్మింటన్‌లో పీవీ.సింధు, శ్రీకాంత్‌పై భారీ అంచనాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ.సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లక్ష్యసేన్ పసిడే లక్ష్యంగా బరిలోకి దిగున్నారు.
మెయిన్ డ్రా బుధవారం నుంచి జరుగుతుంది. ప్రపంచ ఛాంపియన్స్ షిప్స్, ఒలింపిక్స్ లో భారత షట్లర్లు పతకాలు సాధిస్తున్నా.. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మాత్రం ఇంతవరకు పసిడి సాధించలేదు.
అయితే మహిళల సింగిల్స్ లో పీవీ సింధుపైనే భారీ అంచనాలు ఉన్నారు. పీవీ.సింధు ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని కసితో ఉంది. గతేడాది ఈ టోర్నీలో ఆమె కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.
డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి, ట్రీసా జాలి-గాయత్రి పుల్లెల జోడీలు కూడా ఆడనున్నాయి
Details
ఆసియా బ్యాడ్మింటన్ పోటీలకు సైనా నెహ్వాల్ దూరం
డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి, ట్రీసా జాలి-గాయత్రి పుల్లెల జోడీలు కూడా ఆడనున్నాయి పురుషుల సింగల్స్ లో శ్రీకాంత్, ప్రణయ్ ఏ విధంగా రాణిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతం వీరిద్దరిపై భారీ ఆశలు ఉన్నాయి.
తొలి రౌండ్లో అద్నాన్ (బహ్రెయిన్)ను శ్రీకాంత్, నయింగ్ (మయన్మార్)ను ప్రణయ్ ఢీ కొడుతున్నారు. వెన్ చి సు (తైవాన్)తో తొలి రౌండ్‌లో సింధు పోటీపడనుంది.
పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆసియా బ్యాడ్మింటన్ బరిలో ఈ ఏడాది సైనా నెహ్వాల్ పాల్గొనడం లేదు.