
Imran Khan : ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం.. షేమ్ అన్ పీసీబీ అంటూ ఫ్యాన్స్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ కు వన్డే ప్రపంచ కప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానం ఎదురైంది.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాక్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాల విడుదల చేసిన వీడియోలో ఇమ్రాన్ ఖాన్ ను విస్మరించడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
1992లో పాక్ కు ప్రపంచ కప్‌ను అందించిన ఇమ్రాన్ ఖాన్ గురించి పీసీబీ విడుదల చేసిన వీడియోలో ప్రస్తావించలేదు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు పీసీబీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
మరోవైపు క్రికెట్ అభిమానులు పీసీబీని #ShameOnPCB హాష్ టాగ్ తో ట్రోలింగ్ చేశారు.
Details
క్రికెట్ కు, రాజకీయాలకు ముడివేయద్దు
ఇమ్రాన్ ఖాన్‌ను పీసీబీ తన వీడియోలో చూపించకుండా చేయడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందనే అరోపణలు వినపడుతున్నాయి.
ఇలాంటి వీడియోలు పెట్టడం అత్యంత బాధాకరమని, వెంటనే ఆ వీడియోను తొలగించాలని పీసీబీ మాజీ చైర్మన్ ఖలీల్ మహమూద్ పేర్కొన్నారు.
ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ప్రోమోలోనే కెప్టెన్ బాబర్ అజామ్‌ను సరిగ్గా ప్రొజెక్టు చేయలేదని విమర్శించారని , అలాగే క్రికెట్ దిగ్గజమైన ఇమ్రాన్ ఖాన్ కు ఇలాంటి అవమానం జరగడం సహేతుకం కాదని అన్నారు.
క్రికెట్ కు, రాజకీయాలకు ముడివేయద్దని మహమూద్హితవు పలికారు.