
IND Vs BAN : టీమిండియాతో మ్యాచుకు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటివరకూ మూడు మ్యాచులు ఆడిన బంగ్లా, ఒక మ్యాచులో విజయం సాధించింది.
ఇక టీమిండియాతో అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లా తలపడనుంది.
ఈ కీలక మ్యాచుకు ముందు బంగ్లా జట్టుకు భారీ షాక్ తగలనుంది. ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్ తో మ్యాచు ఆడడం అనుమానంగా మారింది.
చైన్నైలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో మ్యాచులో పరుగు తీస్తుండగా షకీబ్ గాయపడ్డాడు.
అయితే గాయం తర్వాత కూడా షకీబ్ బ్యాటింగ్ కొనసాగించాడు. మ్యాచ్ అనంతరం చైన్నైలో షకీబ్‌కి స్కానింగ్ చేయగా, గాయం తీవ్రత ఎక్కువ ఉన్నట్లు తెలిసింది.
Details
ఫిట్ గా ఉంటేనే ఆడిస్తాం : ఖలీల్ మహమూద్
షకీబ్ అల్ హసన్ గాయంపై బంగ్లాదేశ్ జట్టు డైరక్టర్ ఖలీల్ మహమూద్ కీలక ప్రకటన చేశాడు.
ప్రస్తుతం షకీబ్ గాయం నుంచి కోలుకుంటున్నాడని తెలిపాడు.
భారత్ తో మ్యాచుకు ముందు అతడు అడే విషయంపై నిర్ణయం తీసుకుంటామని, ఫిట్ గా ఉంటేనే ఆడిస్తామని, లేకుంటే రిస్క్ తీసుకోమని చెప్పాడు.
ఈ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇంకా 6 మ్యాచులను బంగ్లా ఆడాల్సిన ఉందని, అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు చేపడుతామని ఖలీల్ మహమూద్ వెల్లడించారు.