ODI WC 2023 : బంగ్లాదేశ్‌కు గట్టి షాక్.. వరల్డ్ కప్‌కు స్టార్ పేసర్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ పేసర్ ఎబదాత్ హొసేప్ వన్డే వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు.
అతను వరల్డ్ కప్ లోపు ఫిట్ నెస్ సాధించడం అసాధ్యమే అని తెలుస్తొంది. ఎబదాత్ హొసేప్ కోలుకోవడానికి ఇంకా నాలుగు నెలలకు పైగానే సమయం పట్టనుంది.
దీంతో ఆ మెగా టోర్నీ మొత్తానికి అతను దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయాన్ని తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. ఇప్పటికే బంగ్లా స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్ కారణంగా ఆసియా కప్ కు దూరమయ్యాడు.
అతని స్థానంలో అన్ మోల్ హక్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.
Details
బంగ్లా తరుపున 12 వన్డేలను ఆడిన హొసేన్
ప్రపంచ కప్‌లో ఎబదాత్ హొసేన్ అందుబాటులో ఉండడం లేదని, ఇది తమకు పెద్ద సమస్య అని, గాయం తగ్గడం కోసం అతను ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని, దీంతో అతడిని వరల్డ్ కప్ పోటీలకు పరిగణించడం లేదని బంగ్లాదేశ్ చీఫ్ సెలెక్టర్ మిన్హజుల్ అబెదిన్ స్పష్టం చేశారు.
గతేడాది వన్డేల్లో అరంగ్రేటం చేసిన హొసేన్ ఇప్పటివరకూ 12 వన్డేలను మాత్రమే ఆడాడు.
అఫ్గనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడిన హొసేన్ ఆసియా కప్ పోటీలకి దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో తంజిమ్ షకీబ్‌ను జట్టులోకి తీసుకున్నారు