Shakib Al Hasan: షకీబ్ అల్ హసన్‌కు బిగ్ షాక్.. బౌలింగ్‌పై నిషేధం విధించిన ఐసీసీ
బంగ్లాదేశ్ క్రికెట్‌లో షకీబ్ అల్ హసన్‌కు ఒక్క రోజు వ్యవధిలోనే రెండు షాకులు తగిలాయి. మొదటగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం విధించగా, తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలీ (ఐసీసీ) కూడా బౌలింగ్‌పై నిషేధం విధించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్ జట్టు ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు బౌలింగ్ చేయడంపై ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విచారణ అనంతరం షకీబ్ బౌలింగ్ యాక్షన్‌ను సరి చేయాల్సిందిగా సూచించింది.
విదేశీ టోర్నీలు మాత్రమే ఆడనున్న షకీబ్ అల్ హసన్
అతని బౌలింగ్ యాక్షన్ 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంపు తిరిగినట్లు నిర్ధారణైంది. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతను బౌలింగ్ చేయడాన్ని నిషేధించారు. ఈ పరిణామాల వల్ల అతడు అంతర్జాతీయ స్థాయిలో, అలాగే విదేశీ లీగుల్లో కూడా బౌలింగ్ చేయడానికి అనర్హుడయ్యాడు. ఇటీవల షకీబ్, భారత్‌తో టెస్టు సిరీస్ ఆడాలని భావించారు, కానీ బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల కారణంగా అతడు స్వదేశానికి వెళ్లలేదు. దీంతో అతడు 'స్వదేశంలో చివరి టెస్టు' ఆడలేదు. వన్డే సిరీస్‌లో కూడా అతడిని బంగ్లా మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది. ఇటువంటి పరిణామాలతో, అతడు ఇప్పుడు విదేశీ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్నారు.