టీమిండియాకు బిగ్ షాక్.. వన్డే సిరీస్‌కు స్టార్ బౌలర్ దూరం
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. నేటి నుంచి విండీస్ తో టీమిండియా మూడు వన్డేల మ్యాచ్ ఆడనుంది. విండీస్ తో జరిగిన రెండో టెస్టులో బౌలింగ్ లో కీలక పాత్ర పోషించినా మహ్మద్ సిరాజ్ ను మాత్రం వన్డే సిరీస్ ను నుంచి తప్పించారు. సిరాజ్ కాలి మడిమ నొప్పితో బాధపడుతున్నాడని, గాయం తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా అతనికి విశ్రాంతినిచ్చారు. దీంతో రవిచంద్రన్ అశ్విన్, అంజిక్యా రహానే, కేఎస్ భరత్, నవదీప్ సైనీతో పాటు సిరాజ్ స్వదేశానికి బయల్దేరాడు.
సిరాజ్ స్థానంలో హార్ధిక్ పాండ్యా..?
సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేకపోవడంతో పేస్ యూనిట్ కు సిరాజ్ నాయకత్వం వహిస్తాడని అంతా భావించారు. అయితే సిరాజ్ ప్రస్తుతం దూరమయ్యాడు. దీంతో అనుభవం లేని జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్ పైనా పేస్ భారం పడే పడనుంది. సిరాజ్ స్థానంలో ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. అతని స్థానంలో హార్ధిక్ పాండ్యాను తీసుకొనే ఛాన్సు కనిపిస్తోంది. అయితే భారత్, విండీస్ మధ్య నేడ సాయంత్రం 7 గంటల నుంచి తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.