Page Loader
Australian team: ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్.. అత్యవసరంగా స్వదేశానికి మార్ష్
ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్.. అత్యవసరంగా స్వదేశానికి మార్ష్

Australian team: ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్.. అత్యవసరంగా స్వదేశానికి మార్ష్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2023
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో మెరుగైన ప్రదర్శనతో సెమీస్‌కు చేరువైన ఆస్ట్రేలియా జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పటికే తలకు గాయం కావడంతో ఇంగ్లండ్ మ్యాచుకు మాక్స్‌వెల్ దూరమయ్యాడు. తాజాగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, ఓపెనింగ్ బ్యాటర్ మిచెల్ మార్ష్ వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి పయనమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతను పెర్త్ వెళ్లినట్లు తెలుస్తోంది. వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా తదుపరి ఆడబోయే మ్యాచులకు అతను అందబాటులో ఉండడని తెలుస్తోంది. ఇక ప్రపంచ కప్ కోసం భారత్‌కు రావడం అనుమానమేనని ఆసీస్ మీడియా వర్గాల ద్వారా తెలిసింది. రోజుల వ్యవధిలో ఇద్దరు స్టార్‌ ఆల్‌రౌండర్ల సేవలను కోల్పోవడంతో ఆసీస్ అభిమానులు షాక్‌కు గురయ్యారు.

Details

మూడో స్థానంలో ఆస్ట్రేలియా

ఇదిలా ఉండే ఆస్ట్రేలియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకూ ఆడిన 6 మ్యాచుల్లో 4 విజయాలను సాధించింది. అగ్రస్థానంలో సౌతాఫ్రికా ఉండగా, రెండో స్థానంలో భారత్, నాలుగో స్థానంలో న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా నవంబర్ 4న ఇంగ్లండ్‌తో, నవంబర్ 11న బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉంది.