బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ!
రెండు నెలలుగా విరామం లేకుండా సాగుతున్న ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్లో ఇక ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 2023 ఫైనల్ ముందు ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సారి ముగింపు వేడుకలను రోటీన్ గా కాకుండా కాస్త డిఫరెంట్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ ముగింపు వేడకలో ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ ఆర్ రెహమాన్, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రదర్శన ఉన్నట్లు సమాచారం. అదే విధంగా రాపర్స్ కింగ్, డీజే న్యూక్లియా ప్రదర్శన ఇవ్వనున్నారు.
ప్రముఖ హీరోయిన్లతో భారీ ప్లాన్
మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ తర్వాత జోనితా గాంధీ, డివైన్ జోడీ ప్రదర్శన ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నరేంద్ర మోదీ స్టేడియంలో ముగింపు వేడుకలకు సంబంధించి సన్నాహాలను పూర్తి చేసినట్లు సమాచారం. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియో సినిమాలో ప్రేక్షకులు ఐపీఎల్ 2023 ముగింపు వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. అరిజిత్ సింగ్, తమన్నా భాటియా, రష్మిక మంధానతో ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. దీంతో పాటు కనులు జిల్ మనేలా లైటింగ్ షోను కూడా బీసీసీఐ ఏర్పాటు చేసింది.