
Durga Puja 2024: దుర్గా పూజలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్.. కుర్తా, ధోతీలో ఫొటోలు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ పై ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తించగలరా?అది మాజీ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా.
కుర్తా,ధోతీ ధరించి ఆయన ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. లారా,పశ్చిమ బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్‌తో కలిసి దుర్గా పూజలో పాల్గొన్నారు.
పర్పుల్ కలర్ కుర్తా,వైట్ కలర్ ధోతీ ధరించి,భారతీయ సంప్రదాయ వస్త్రాల్లో ఆకర్షణీయంగా నిలిచాడు.
ఈ సందర్భంగా,లారా అక్కడ డ్రమ్స్ ను వాయించాడు.కోల్‌కతాకు ఎన్నో సార్లు వచ్చినా,ఈసారి దుర్గా పూజలో తొలిసారి పాల్గొన్నట్లు తెలిపాడు.
సురుచి సంఘం 71వసంవత్సరంలో ఈ దుర్గా ఉత్సవాలను నిర్వహిస్తోంది.మహాలయ అమావాస్య రోజు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఉత్సవాలను ప్రారంభించారు.
ఇప్పుడు,లారా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.బ్రియాన్ లారా ఈ ఉత్సవాలలో చాలా ఆనందంగా ఎంజాయ్ చేసినట్లు కనిపించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
#WATCH | Kolkata, West Bengal | West Indies legendary cricketer Brian Lara visits Suruchi Sangha Club Durga Puja pandal. pic.twitter.com/zfW9wAVBCo
— ANI (@ANI) October 6, 2024