LOADING...
Asian Games - 2023 : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట జోరు.. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో కాంస్యం
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట జోరు.. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో కాంస్యం

Asian Games - 2023 : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట జోరు.. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో కాంస్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2023
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేటలో తన జోరును కొనసాగిస్తోంది. గతంలో కంటే ఈసారీ భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. తాజాగా మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ ముఖర్జి, ఐహిక ముఖర్జిలతో కూడిన ఇండియన్ టీమ్ కాంస్య పతకాన్ని సాధించింది. ఆసియా క్రీడల చరిత్రలో మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్ లో కాంస్య పతకం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సోమవారం జరిగిన సెమీ ఫైనల్‌లో ఉత్తర కొరియాకు చెందిన చా సుయోంగ్, పాక్ సుగ్యోంగ్ జోడి చేతిలో భారత్ ఓడిపోయంది. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Details

పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన భారత్

చా సుయోంగ్, పాక్ సుగ్యోంగ్ జోడి చేతిలో ఐహిక్, సుతీర్థ 11-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 2-11 తేడాతో ఓటమిపాలయ్యారు. ఇప్పటివరకూ భారత్ ఖాతాలో ఈ ఏషియాడ్ పతకాల సంఖ్య 53కు చేరింది. అందులో 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలున్నాయి. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.