LOADING...
Jasprit Bumrah: బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడు.. తుది నిర్ణయం మేనేజ్‌మెంట్‌దే!
బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడు.. తుది నిర్ణయం మేనేజ్‌మెంట్‌దే!

Jasprit Bumrah: బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడు.. తుది నిర్ణయం మేనేజ్‌మెంట్‌దే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక అయిదో టెస్టులో జస్పిత్ బుమ్రా పాల్గొనే అవకాశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తాజా వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. బుమ్రా పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నాడని ఆయన వెల్లడించారు. అయితే సిరీస్ ప్రారంభంలోనే బుమ్రాతో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడించాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే బుమ్రా మూడు టెస్టుల్లో పాల్గొన్నాడు. కానీ భారత్‌కు ఆశించిన స్థాయిలో పేస్ బౌలింగ్ ఆప్షన్లు లేకపోవడంతో బుమ్రాను ఐదో టెస్టుకు నిలిపేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై కోటక్ మాట్లాడుతూ, 'బుమ్రా ఫిట్‌గానే ఉన్నాడు.

Details

పేసర్లు అందరూ ఫిట్ గానే ఉన్నారు

గత మ్యాచ్‌లో అతడు కేవలం ఒక ఇన్నింగ్స్‌ మాత్రమే బౌలింగ్ చేశాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్, ఫిజియో కలిసి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు మాత్రం బుమ్రా ఆడుతాడా లేదా అన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఇక ఇప్పటికే గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, జట్టులోని పేసర్లు అందరూ ఫిట్‌గా ఉన్నారని చెప్పారు. బుమ్రా ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 14 వికెట్లు సాధించిన అతడు, జట్టుకు కీలకంగా నిలిచాడు. దీంతో, టెస్టు సిరీస్‌లో తుది పోరులో బుమ్రా ఉండే అవకాశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.