Page Loader
Jasprit Bumrah: జంగిల్ కథతో బుమ్రా రీ ఎంట్రీ స్పెషల్..సంజనా గణేశన్ హార్ట్‌టచింగ్ వీడియో! 
జంగిల్ కథతో బుమ్రా రీ ఎంట్రీ స్పెషల్..సంజనా గణేశన్ హార్ట్‌టచింగ్ వీడియో!

Jasprit Bumrah: జంగిల్ కథతో బుమ్రా రీ ఎంట్రీ స్పెషల్..సంజనా గణేశన్ హార్ట్‌టచింగ్ వీడియో! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటి వరకు ఆశించిన విజయాలు అందుకోలేక కష్టాల్లో పడుతున్న ముంబయి ఇండియన్స్‌కు ఒక శుభవార్త అందింది. పేస్ సెన్సేషన్ జస్పిత్ బుమ్రా మళ్లీ జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ తమ అధికారిక ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతాలో ప్రకటించింది. 'రెడీ టు రోర్' అనే క్యాప్షన్‌తో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో బుమ్రా భార్య సంజనా గణేశన్, కుమారుడు అంగద్ ఉన్నారు. అంగద్‌కు తన తండ్రి ఐపీఎల్ జర్నీ గురించి సంజనా వివరించగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Details

వెన్ను నొప్పి కారణంగా బుమ్రా దూరం

బుమ్రా గత జనవరిలో ఆస్ట్రేలియా టూర్ తర్వాత వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకున్న బుమ్రా, తిరిగి బౌలింగ్ ప్రారంభించాడు. తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ముంబై ఇండియన్స్‌ జట్టుతో చేరాడు. అయితే ఏప్రిల్ 7న ఆర్‌సీబీతో జరగనున్న మ్యాచ్‌కు ఆయన అందుబాటులో ఉండడంలేదన్న సమాచారం. బుమ్రా ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుమ్రా తిరిగొచ్చిన నేపథ్యంలో ముంబై శిబిరంలో ఆశావహ వాతావరణం నెలకొంది.

Details

ఒక్క విజయాన్ని మాత్రమే అందుకున్న ముంబై

ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే అందుకున్న ముంబై, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. బుమ్రా రాకతో ముంబై గెలుపు పథంలోకి తిరిగొస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్ లాంటి బౌలర్లు ఉండి కూడా ఇప్పటివరకు పట్టు సాధించలేకపోయారు. ఇప్పుడు బుమ్రా అండతో వారు మెరుగైన ప్రదర్శన కనబరచే అవకాశం ఉంది. ఆయన రాక ముంబైకు తిరుగులేని బలాన్ని అందిస్తుందా? అనే ఉత్కంఠ క్రికెట్ ప్రియుల్లో నెలకొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో