LOADING...
Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌కి షాక్‌! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు
బుమ్రా స్పెల్‌కి షాక్‌! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు

Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌కి షాక్‌! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత జట్టుభ సిద్దమవుతోంది. జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ హెడింగ్లీ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ ఇండియా ఇప్పటికే ఇంగ్లండ్‌ చేరుకొని బెకెన్‌హామ్‌లో నెట్స్‌లో శ్రద్ధగా ప్రాక్టీస్‌ ప్రారంభించింది. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌లో పేస్ అస్త్రం జస్ప్రీత్‌ బుమ్రా మెరుపులు మెరిపించాడు. అతని బౌలింగ్‌లో స్పీడ్, సూక్ష్మ నియంత్రణ మళ్లీ చలాకీగా కనిపించాయి. బ్యాటర్లను దుస్సాహసానికి గురిచేస్తూ.. క్రీజ్‌లో కదలలేకపోయేలా చేసిన బంతులు సంధించాడు. ఇది భారత జట్టు అభిప్రాయాన్ని మరింత బలంగా చూపిస్తోంది—బుమ్రా ఫామ్‌లో ఉండటమే విజయానికి కీలకంగా మారనుంది.

Details

అన్ని మ్యాచుల్లో అడకపోవచ్చు

అయితే బుమ్రా పూర్తి సిరీస్‌లో పాల్గొననున్నాడా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్‌లోడ్‌ నిర్వహణ దృష్ట్యా అతన్ని అన్ని మ్యాచ్‌ల్లో ఆడించకపోవచ్చు. ఈ విషయంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ వెల్లడించాడు. అలాగే వరుసగా అన్ని టెస్టుల్లో బుమ్రా బరిలోకి దిగడం కష్టమేనని సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్‌ అగార్కర్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు. గతంలో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా జనవరిలో సిడ్నీలో జరిగిన అయిదో టెస్ట్‌ మ్యాచ్‌లో బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. అప్పటి నుంచే అతని వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా నిర్వహించాలని ఫిజియోలు బీసీసీఐకి సూచనలు అందజేశారు. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనలో అతని అందుబాటుపై జట్టు మేనేజ్‌మెంట్‌ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోనుంది.