Jasprit Bumrah: కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసిన బుమ్రా.. తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత
టీమిండియా స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రా తన రీఎంట్రీ మ్యాచులో రికార్డును సాధించారు. కెప్టెన్‌గా మరెవరకీ సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేయడం విశేషం. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో తాను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కేవలం 4 నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లను తీసిన బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 కెప్టెన్‌గా అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు. ఇప్పటివరకూ ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాకపోవడం గమనార్హం.
భారత జట్టుకు ఫాస్ట్ బౌలర్ గా ఎంపికైన తొలి కెప్టెన్ బుమ్రానే
ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కావడంతో బుమ్రా ద్వితీయ శ్రేణికి జట్టుకు నాయకత్వం వహించాడు. టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన తొలి ఫాస్ట్ బౌలర్ కూడా బుమ్రానే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ పై భారత్ 2 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు భారత్ వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడటంతో అంపైర్లు భారత్ ను విజేతగా నిర్ణయించారు.