
Jasprit Bumrah: లార్డ్స్‌లో చెలరేగిన బుమ్రా.. ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక మూడో టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన శైలి చూపించాడు. లార్డ్స్ మైదానంలో తొలిసారి ఫైవ్ వికెట్ హాల్ (5/74) అందుకున్నాడు. హ్యారీ బ్రూక్ (11), బెన్ స్టోక్స్ (44), జో రూట్ (104), క్రిస్ వోక్స్ (0), జోఫ్రా ఆర్చర్ (4)లను బుమ్రా పెవిలియన్ పంపాడు. అయితే అరుదైన ఘనత సాధించినప్పటికీ బుమ్రా పెద్దగా సెలెబ్రేషన్ చేయలేదు. అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు గల కారణాన్ని స్వయంగా బుమ్రానే వెల్లడించాడు. రెండో రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాగా అలసిపోయాను. అందుకే పెద్దగా సంబరాలు చేసుకోలేకపోయా.
Details
చాలా ఓవర్లు బౌలింగ్ చేసి అలసిపోయా
చాలా ఓవర్లు బౌలింగ్ చేశా. శారీరకంగా తీరిపోయా. అంతేగానీ, నేను ఇప్పుడు ఎగిరి గంతులు వేయే వయసులో లేను. ఐదో వికెట్ వచ్చిన వెంటనే మళ్లీ బౌలింగ్‌కు వెళ్లిపోయా. నిజం చెప్పాలంటే, నా ప్రదర్శనపై నేను చాలా సంతృప్తిగా ఉన్నానని బుమ్రా స్పష్టంగా చెప్పాడు. బుమ్రా లార్డ్స్ గణాంకాలు: తొలి రోజు: 18 ఓవర్లు - 1 వికెట్ రెండో రోజు: 9 ఓవర్లు - 4 వికెట్లు మొత్తం: 27 ఓవర్లు - 5 వికెట్లు (15వ ఫైవర్ టెస్టుల్లో)
Details
విదేశాల్లో బుమ్రా రికార్డు
ఈ ఫైవ్ వికెట్ హాల్‌తో బుమ్రా టెస్టుల్లో 15వసారి ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. వీటిలో విదేశాల్లోనే 12 ఫైఫర్లు సాధించడం విశేషం. దీంతో విదేశాల్లో అత్యధిక ఫైవర్స్ తీసిన టీమిండియా బౌలర్‌గా రికార్డు కూడా నెలకొల్పాడు. రెండో టెస్టులో బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. నాలుగు టెస్టుల్లో మిగిలిన రెండింట్లో కేవలం ఒకటే టెస్ట్ ఆడనున్నాడు. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ గతంలో పేర్కొంది.