
Canada: 2026 టీ20 వరల్డ్‌కప్‌లో చోటు సంపాదించిన కెనడా
ఈ వార్తాకథనం ఏంటి
2027లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కి కెనడా జట్టు అర్హత సాధించింది. అమెరికా క్వాలిఫయర్స్ పోటీల్లో ఐదు విజయాలు నమోదు చేసిన కెనడా, చివరి మ్యాచ్‌లో బహమాస్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్ బెర్తును ఖాయం చేసుకుంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకల సంయుక్త ఆతిథ్యంతో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి.
Details
గతంలోనూ పాల్గొన్న కెనడా
ఇప్పటికే భారత్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు అర్హత సాధించగా, తాజాగా కెనడా కూడా ఈ జాబితాలో చేరింది. గతంలో అమెరికా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్ లోనూ కెనడా జట్టు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక రాబోయే ప్రపంచకప్ టోర్నమెంట్‌కి ఐరోపా, ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి రెండేసి జట్లు, ఆసియా-ఈఏపీ క్వాలిఫయర్స్ నుంచి మూడు జట్లు అర్హత పొందాల్సి ఉంది.