AFG vs NZ: మ్యాచ్ రద్దు.. నోయిడాలో టెస్టు మ్యాచ్‌పై అప్గాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి
అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు, గ్రేటర్ నోయిడా మైదానం నిర్వాహకుల మధ్య ఏర్పడిన సమాచార లోపం కారణంగా, అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ అనిశ్చితిలో పడింది. భారీ వర్షాల కారణంగా మైదానం చిత్తడిగా మారడం, అలాగే మైదానం సిబ్బంది నుంచి సకాలంలో సరైన సహకారం అందకపోవడం వల్ల రెండు రోజుల ఆట రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ టెస్టు నోయిడాలో నిర్వహించడం అనేది సరైన నిర్ణయం కాదని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు స్పందించారు. దీనికి ముందు లఖ్‌నవూ, దెహ్రాదూన్ మైదానాలను కోరినా, బీసీసీఐ ఆ రెండు స్టేడియాలను టీ20 లీగ్‌ల నిర్వహణ కారణంగా నిరాకరించింది. దీంతో నోయిడాను ఎంచుకున్నామని అఫ్గాన్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.
నోయిడా మైదానం టెస్టు మ్యాచ్ కు అనుకూలం కాదు
నోయిడా కంటే అఫ్గానిస్థాన్‌లోని మైదానాల్లోనే మెరుగైన సదుపాయాలు ఉన్నాయని, ఇక్కడ మౌలిక సదుపాయాల్లో ఎలాంటి అభివృద్ధి చూడలేకపోయామని అఫ్గాన్ కెప్టెన్ షాహిది వ్యాఖ్యానించాడు. ముందుగా బీసీసీఐ బెంగళూరు, కాన్పూర్ మైదానాలను కూడా సూచించినప్పటికీ, నోయిడా దిల్లీకి సమీపంగా ఉండటంతో అఫ్గాన్ బోర్డు దానిని ఎంచుకుంది. కానీ, ఇప్పుడు నోయిడా మైదానం టెస్టు నిర్వహణకు అనుకూలం కాకపోవడంతో ఈ నిర్ణయం తప్పుమని అర్థమవుతోంది.