LOADING...
MIw vs GGw: కెప్టెన్ హర్మన్ ప్రీత్ మెరుపులు.. ముంబై ఇండియన్స్ విజయం
కెప్టెన్ హర్మన్ ప్రీత్ మెరుపులు.. ముంబై ఇండియన్స్ విజయం

MIw vs GGw: కెప్టెన్ హర్మన్ ప్రీత్ మెరుపులు.. ముంబై ఇండియన్స్ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2026
11:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ 2026లో గుజరాత్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (71* ) అద్భుత అర్ధసెంచరీతో విజయాన్ని అందించారు. అయితే ఆరంభంలో ఓపెనర్లు కమలిని (13), మాథ్యూస్‌ (22) నిరాశపరచడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఈ దశలో హర్మన్‌కు అమన్ జోత్‌ (40) చక్కటి సహకారం అందిస్తూ మూడో వికెట్‌కు 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం కేరీ (38* ) మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరు వేగంగా ముందుకు సాగింది. చివరకు లక్ష్యాన్ని విజయవంతంగా చేధించిన ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏడు వికెట్ల తేడాతో ముంబై గెలుపు

Advertisement