
FIR on Mitchell Marsh: దిల్లీలో మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే ప్రపంచకప్‌పై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఫిర్యాదు మేరకు దిల్లీ గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మిచెల్ మార్ష్ వరల్డ్ కప్‌పై కాళ్లు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ ట్రోఫీని అవమానించడంతో పాటు 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను గాయపరిచనట్లు కేశవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
భారత్ ఫ్యాన్స్ మార్ష్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Details
మార్ష్ తీరుపై మండిపడుతున్న భారత్ అభిమానులు
ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో విశ్వవిజేతగా ఆస్ట్రేలియా నిలిచింది.
ఆరోసారి ప్రపంచ కప్ గెలుచుకున్న ఆసీస్ ప్లేయర్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
ఇక డ్రెస్సింగ్ రూములో మార్ష్ ఒక చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని, రెండు పాదాలను ట్రోఫీపై ఉంచాడు.
ఈ ఫోటో వైరల్ కావడంతో భారత్ అభిమానులు మార్ష్ పై మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆలీఘర్‌కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్‌టీఐ కార్యకర్త, మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాజాగా ఇదే అంశంపై టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా స్పందించాడు. మిచెల్ అలా చేయడం తనని తీవ్రంగా బాధించిందని చెప్పాడు.