Page Loader
Delhi Capitals: ఢిల్లీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో గేమ్ ఛేంజింగ్ క్యాచ్ .. అద్భుతమైన క్యాచ్‌లతో మ్యాచ్‌ను విన్ చేసిన ఢిల్లీ
ఢిల్లీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో గేమ్ ఛేంజింగ్ క్యాచ్ ..

Delhi Capitals: ఢిల్లీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో గేమ్ ఛేంజింగ్ క్యాచ్ .. అద్భుతమైన క్యాచ్‌లతో మ్యాచ్‌ను విన్ చేసిన ఢిల్లీ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

బంతి గాల్లో ఉన్నా,నేలమీద ఉన్నా తేడాలేకుండా ఢిల్లీ ఆటగాళ్లు దానిని పట్టేశారు. వారు చూపించిన అద్భుతమైన ఫీల్డింగ్‌నే సన్‌రైజర్స్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మ్యాచ్ ప్రారంభం నుండి చివరి ఓవర్‌ వరకు ఢిల్లీ అదే జోరును కొనసాగిస్తూ విజయం సాధించింది. 'క్యాచ్‌లు గెలిపిస్తాయి'అనే మాటను ఢిల్లీ ఫీల్డర్లు మరోసారి నిజం చేశారు. వైజాగ్ వేదికగా ఢిల్లీ అద్భుత ప్రదర్శన ఐపీఎల్ 2025లో భాగంగా,వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్,సన్‌ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీ తమ రెండో హోం గ్రౌండ్ అయిన వైజాగ్‌లో మరో విజయం నమోదు చేసింది.ఈమ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ,ఢిల్లీ బౌలర్లు,ఫీల్డర్లు ఉత్సాహంతో ఆడి ప్రత్యర్థిజట్టును కష్టాల్లోకి నెట్టారు.

వివరాలు 

ఆరంభంలోనే ఢిల్లీ దంచికొట్టింది 

మ్యాచ్ మొదటి ఓవర్‌లోనే అభిషేక్ శర్మను విప్‌రాజ్ రనౌట్ చేసి ఢిల్లీకి శుభారంభం అందించాడు. అనంతరం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఢిల్లీ ఫీల్డర్లు సమర్థంగా ఉపయోగించుకున్నారు.ముఖ్యంగా, మిచెల్ స్టార్క్ తన అనుభవాన్ని ఉపయోగించి ఫీల్డింగ్‌ను చక్కగా అమర్చుకొని సన్‌రైజర్స్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టేలా చేశాడు. ఇషాన్ కిషన్ డీప్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా భారీ షాట్ కొట్టగా,ట్రిస్టన్ స్టబ్స్ అదిరిపోయే క్యాచ్ పట్టాడు. అదే ఓవర్‌లో,స్టార్క్ తన వేగాన్ని తగ్గించి వేసిన బంతిని సిక్సర్ కొట్టే ప్రయత్నంలో నితీష్ కుమార్ రెడ్డి మిడాన్‌లోనే ఔటయ్యాడు. ఐదో ఓవర్‌లో,స్టార్క్ వేసిన బంతిని ట్రావిస్ హెడ్ బ్యాక్‌వర్డ్ పాయింట్ మీదుగా తరలించాలనుకున్నాడు. అయితే, అది గ్లౌజ్‌ను తాకి నేరుగా వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళింది.

వివరాలు 

మొత్తం మీద... 

ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్, బౌలింగ్ అద్భుతంగా ఉండటంతో, వారు సన్‌రైజర్స్‌ను ఓడించి మరో గొప్ప విజయాన్ని నమోదు చేసుకున్నారు. పదకొండో ఓవర్‌లో మోహిత్ శర్మ వేసిన ఐదో బంతిని మిడాన్, మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించేందుకు హెన్రిచ్ క్లాసెన్ ప్రయత్నించాడు. కానీ బంతికి ఎడ్జ్ తగిలి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న అభిషేక్ శర్మ కొద్దిగా అసౌకర్యానికి గురైనా, తన ఓర్పుతో విప్‌రాజ్ రనౌట్‌ చేసిన తర్వాత ఆ క్యాచ్‌ను అందుకొని మ్యాచ్‌కు కీలక మలుపు తిప్పాడు. పదహారో ఓవర్‌లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న యువ ఆటగాడు అనికేత్ వర్మ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు.

వివరాలు 

పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకిన క్యాపిటల్స్ 

ఓవర్ మిడ్ వికెట్ మీదుగా బంతిని లాగగా, అది బౌండరీ దాటుతుందనుకున్న సమయానికి అక్కడే అప్రమత్తంగా ఉన్న ఫ్రేజర్ మెక్‌గర్క్ గాల్లోకి దూకి అద్భుతంగా అందుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్,అనికేత్ వర్మ చివరిదాకా క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే 163 పరుగులకే ఆలౌట్ అయింది. హోం గ్రౌండ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆత్మవిశ్వాసంతో ఆడి,ఈ లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలో ఛేదించారు. ఫాఫ్ డుప్లెసిస్ 50,జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ 38, కేఎల్ రాహుల్ 15, అభిషేక్ పోరెల్ 34, ట్రిస్టన్ స్టబ్స్ 21 పరుగులు చేయడంతో కేవలం 3 వికెట్ల నష్టంతో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా, సన్‌రైజర్స్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గేమ్ ఛేంజింగ్ క్యాచ్