Rachin Ravindra: ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర?
ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి వరల్డ్ కప్ మ్యాచులో ఒక్క ఇన్నింగ్స్‌తోనే క్రికెట్ ప్రపంచాన్ని న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తన వైపునకు తిప్పుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులోనే ఎంతో అనుభవమున్న ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కులు చూపిస్తూ, 93 బంతుల్లోనే 123 పరుగులు చేశారు. ఇంతకీ ఈ రచన్ రవీంద్ర ఎవరో మనం తెలుసుకుందాం. బెంగళూరుకి చెందిన రచిన్ రవీంద్ర తండ్రి పేరు రవి కృష్ణమూర్తి, ఆయన 1990ల్లోనే న్యూజిలాండ్‌కి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. రవి కృష్ణమూర్తి హాట్ హాక్స్ అనే క్లబ్‌ను స్థాపించడంతో ఆ క్లబ్ తరుపున రచిన్ రవీంద్ర ఆడేవాడు. అతనితో పాటు చాలామంది ప్లేయర్లు న్యూజిలాండ్ నుంచి అనంతపురంకు వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడారు.
తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేసిన రచిన్ రవీంద్ర
21 ఏళ్ల వయస్సులోనే న్యూజిలాండ్ టీ20 జట్టులోకి రచిన్ రవీంద్ర ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత టెస్టు వన్డే జట్లలోనూ చోటు సంపాదించాడు. వాస్తవానికి ప్రపంచ కప్‌లో రచిన్ రవీంద్రను ఎంపిక చేయలేదు. అయితే స్పిన్ ఆల్ రౌండర్ బ్రాస్ వెల్ గాయపడి ప్రపంచ కప్‌కు దూరం కావడంతో అనుకోకుండా రచిన్‌కు అవకాశం లభించింది. పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచులో అతను 97 పరుగులు చేయడంతో, అతన్ని మూడో స్థానంలో పంపగా తనమీద ఉన్న నమ్మకాన్ని నిరూపించుకున్నాడు. ఇప్పటివరకూ రచిన్ రవీంద్ర 3 టెస్టులు, 12 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. ఇదే అతడికి తొలి అంతర్జాతీయ సెంచరీ విశేషం.