
Lalit Rajbanshi:నేపాల్ క్రికెటర్‌కు షాది డాట్ కామ్ సీఈఓ అండ
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ టోర్నీకి నేపాల్ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గ్రూప్ దశలో టీమిండియా చేతిలో నేపాల్ జట్టు ఓటమిపాలైంది.
అయితే నేపాల్ ఆటగాళ్లు ఊహించిన దాని కంటే మెరుగైన ప్రదర్శన చేసి అందరి మన్ననలను అందుకున్నారు.
ఆసియా కప్ లో భాగంగా నేపాల్ ప్లేయర్ లలిత్ రాజ్‌బన్షి , టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కలిశాడు.
ఈ నేపథ్యంలో అతడితో దిగిన పోటో ఎక్స్ లో షేర్ చేశాడు. తాను పలు మ్యాచుల్లో బ్యాటింగ్ చేశానని, కానీ అంతర్జాతీయ మ్యాచులు ఆడటానికి తన సరైన క్రికెట్ కిట్ లేదని రాజ్‌బన్షి రాసుకొచ్చాడు.
ఇందుకు సంబంధించిన పోస్టు వైరల్ కావడంత షాది డాట్ కామ్ సీఈఓ అనుపమ్ మిత్తల్ స్పందించారు.
Details
ఖరీదైన క్రికెట్ కిట్ అందిస్తానన్న అనుపమ్ మిత్తల్
ప్రాక్టీస్ సమయంలో తన సహచర ఆటగాళ్ల బ్యాట్ పై ఆధారపడాల్సి వస్తోందని, కుశాల్ భూర్టెల్ బ్యాట్ ను ఎక్కువగా తీసుకుంటానని రాజబన్షి పేర్కొన్నారు.
రాజ్ కోసం ఖరీదైన క్రికెట్ అందిస్తానని, అతడిని కలుసుకునే అవకాశాన్ని తనకు ఇవ్వాలంటూ అనుపమ్ మిత్తల్ కోరారు.
అనుపమ్ మిత్తల్ తనకు అండగా నిలవడంతో రాజ్ బన్షి ఇన్ స్టా వేదికగా అతనికి కృతజ్ఞతలు తెలిపాడు.
షార్క్ ట్యాంక్ ఇండియా రియాల్టీ షో తో షాదీ డాట్ కామ్ సీఈఓ అనుపమ్ మిత్త మంచి గుర్తింపును తెచ్చుకున్న విషయం తెలిసిందే.