Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు భారీ ప్రైజ్‌మనీ.. మిగిలిన జట్లకు ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఈ విజయంతో భారత్ చాంపియన్స్ ట్రోఫీని అత్యధికంగా గెలుచుకున్న జట్టుగా నిలిచింది. ఫైనల్‌కు ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై తెగ ప్రచారం జరిగింది.
ఈ ఊహాగానాలకు ప్రధాన కారణం ఇటీవల అతని ఫామ్ లేమి. అయితే రోహిత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విమర్శలను తిప్పికొడుతూ తన కెప్టెన్సీలో టీమిండియాకు మరో ఐసీసీ టైటిల్ అందించాడు.
2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీని కూడా అందించడం రోహిత్ కెప్టెన్సీ సత్తాను మరోసారి రుజువు చేసింది.
Details
మూడోసారి టైటిల్ గెలుచుకున్న అరుదైన జట్టుగా భారత్
భారత్ 2002, 2013లో కూడా ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సారి కూడా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా విజేతగా నిలిచింది.
చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మూడోసారి టైటిల్ గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ అరుదైన రికార్డు నమోదు చేసింది.
చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టు భారీ ప్రైజ్‌మనీ అందుకుంది. ఐసీసీ కింద భారత జట్టుకు 2.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.19.5 కోట్లు) బహుమతిగా లభించాయి.
గతంతో పోలిస్తే ఈసారి ఐసీసీ ప్రైజ్‌మనీని 53శాతం పెంచినట్లు ప్రకటించింది.
Details
ఏ ఏ జట్లకు ఎంతంటే?
రన్నరప్ న్యూజిలాండ్‌కు 1.12 మిలియన్ డాలర్లు (రూ.9.72 కోట్లు)
సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు రూ.4.86 కోట్లు
గ్రూప్ దశలో గెలిచిన జట్లకు రూ.30 లక్షల ప్రైజ్‌మనీ
ఐదో, ఆరో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.3 కోట్లు
ఏడో, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1.2 కోట్లు
టోర్నీలో పాల్గొన్న ఎనిమిది జట్లకు రూ.1.08 కోట్లు
ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ 6.9 మిలియన్ డాలర్లు (సుమారు రూ.60 కోట్లు) అని ఐసీసీ అధ్యక్షుడు జై షా ప్రకటించారు.
భారత జట్టు ఈ విజయం ద్వారా ఐసీసీ టోర్నమెంట్లలో తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకోవడం అభిమానులను ఉత్సాహపరచింది.