
ముంబై విజయంతో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో స్పల్ప మార్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఉప్పల్ స్టేడియంలో మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.
ఈ మ్యాచ్ లో ముంబై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ సీజన్లో వరుసగా ముంబై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
ఫలితంగా మూడు విజయాలతో ఆరు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ముంబై దూసుకెళ్లింది.
మరోపక్క ఓటమితో హైదరాబాద్ 9వ స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు పరాజయాలతో చివరి స్థానంలో కొనసాగుతోంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో లక్నో, మూడో స్థానంలో చైన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి.
details
మొదటి స్థానంలో ఆర్సీబీ కెప్టెన్
ముంబై మ్యాచ్ లో చెలరేగిన తిలక్ వర్మ 214 పరుగులతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఇప్పటివరకూ ఐదు మ్యాచ్ లు ఆడి 259 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
వెంకటేష్ అయ్యర్ 234 పరుగుతో రెండో స్థానంలో, శిఖర్ ధావన్ 233 పరుగులతో మూడో స్థానంలో నిలిచారు.
పర్పుల్ క్యాప్ ను రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజేంద్ర చాహల్ 11 వికెట్లతో యథావిధిగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
నిన్నిటి మ్యాచ్ లో సన్ రైజర్స్ పై రెండు వికెట్లు తీసినా పీయూష్ చావ్లా 7 వికెట్లతో 9వ స్థానానికి చేరుకున్నాడు.