Page Loader
Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు టీమిండియా స్క్వాడ్‌లో మార్పు? హర్షిత్ రాణా చేరిక ఉత్కంఠ! 
ఇంగ్లాండ్ టూర్‌కు ముందు టీమిండియా స్క్వాడ్‌లో మార్పు? హర్షిత్ రాణా చేరిక ఉత్కంఠ!

Team india: ఇంగ్లాండ్ టూర్‌కు ముందు టీమిండియా స్క్వాడ్‌లో మార్పు? హర్షిత్ రాణా చేరిక ఉత్కంఠ! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ఇంకొన్ని రోజుల్లోనే ఆరంభం కానుంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో, భారత జట్టులో యువకులకు బీసీసీఐ ప్రాధాన్యత ఇచ్చింది. శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మే 24న బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో మొత్తం 18 మంది సభ్యులున్నారు. ఇందులో తొలిసారి సాయిసుదర్శన్‌కు టెస్టు జట్టులో చోటు దక్కగా, కరుణ్ నాయర్, శార్దూల్ ఠాకూర్‌లకు పునరాగమనం కలిగింది. జట్టులో బౌలింగ్ విభాగాన్ని పరిగణనలోకి తీసుకుంటే, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ వంటి ఐదుగురు పేసర్లు ఉన్నారు.

Details

ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు

ఇక మరో యువ బౌలర్ హర్షిత్ రాణా పేరు కూడా తెరపైకి వచ్చి, టెస్ట్ జట్టుతో కలవనున్నట్లు సమాచారం. ఇది నిజమైతే, టీమిండియా స్క్వాడ్ 18 మంది నుంచి 19కి పెరగనుంది. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల భారత్ ఏ జట్టు, ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టులో హర్షిత్ రాణా బౌలింగ్‌లో 99 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. బ్యాటింగ్‌లో 16 పరుగులు చేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టు అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా, తన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు.

Details

48 వికెట్లు తీసిన రాణా

ఆ మ్యాచ్‌లో 50.75 యావరేజ్‌తో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడి బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 48/3 కాగా, ఇది పెర్త్‌లో నమోదైంది. మొత్తం 13 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 27.79 యావరేజ్‌తో 48 వికెట్లు తీసిన రాణా, బ్యాటింగ్‌లో కూడా మెరిసి ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రాణా టీమిండియాతో కలిసే అవకాశాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బీసీసీఐ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.