LOADING...
HBD Ravindra Jadeja: హ్యాపీ బర్త్ డే మిస్టర్ జడ్డూ.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ
హ్యాపీ బర్త్ డే మిస్టర్ జడ్డూ.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

HBD Ravindra Jadeja: హ్యాపీ బర్త్ డే మిస్టర్ జడ్డూ.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2023
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, చైన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా బుధవారం తన 35వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 35 ఏళ్ల వయస్సులో కూడా జడేజా ఇండియాలో ఫిట్టెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. జడేజా 2009లో అరంగేట్రం చేసి, దాదాపు 14 సంవత్సరాలుగా జాతీయ జట్టు తరుపున ఆడాడు. తన కెరీర్‌లో ఎన్నో విజయాలను సాధించి, అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ రౌండర్ అనగానే గుర్తొచ్చే పేరు రవీంద్ర జడేజా(Ravindra Jadeja). భారత్ తరుఫున అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా ఎదగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం. తన బౌలింగ్‌తో పరుగుల ప్రవాహాన్ని ఆపగలడు. అతని బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని జట్టుకు విజయాలను అందించగలడు.

Details

టీమిండియా వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా

కీలక సమయంలో వికెట్లు తీసి జడేజా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ వన్డే వరల్డ్ కప్‌లో 11 మ్యాచుల్లో 4.25 ఎకానమీ రేటుతో 16 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా తరుఫున నెంబర్ 6 లేదా నంబర్ 7 స్థానంలో ఆడి వేగంగా పరుగులు రాబట్టే సామర్థ్యం జడేజా కు ఉంది. కీలక సమయంలో బ్యాటింగ్‌లోనూ తానెంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా జడేజా మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ చేస్తూ ప్రత్యర్థులకు హడలెత్తిస్తాడు. అయితే సౌతాఫ్రికా టూర్​లో భాగంగా జరగనున్న వ‌న్డేల‌కు జడ్డూ ఎంపిక కాలేదు. కానీ టీ20ల్లో అత‌డికి వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను మేనేజ్​మెంట్​ అప్పగించింది. దాదాపు 15 నెల‌ల త‌రువాత జడేజా టీ20 మ్యాచులు ఆడ‌నున్నాడు.