LOADING...
Team india: చెపాక్‌లో చెమటోడ్చిన అక్షర్… జట్టులో స్థానం దాదాపు ఖాయం
చెపాక్‌లో చెమటోడ్చిన అక్షర్… జట్టులో స్థానం దాదాపు ఖాయం

Team india: చెపాక్‌లో చెమటోడ్చిన అక్షర్… జట్టులో స్థానం దాదాపు ఖాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను జట్టుకు దూరంగా ఉంచినందుకు భారత జట్టు మేనేజ్‌మెంట్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అయితే జింబాబ్వేతో జరిగే తదుపరి మ్యాచ్‌లో అతనిని తుది జట్టులో చేర్చడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు చెపాక్‌ స్టేడియంలో టీమ్‌ఇండియా కఠిన సాధనలో నిమగ్నమై ఉండగా, అక్షర్‌ కూడా ఉత్సాహంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

వివరాలు 

సూర్యకుమార్‌తో కలిసి అక్షర్‌ ప్రాక్టీస్

మంగళవారం ఆయన ఎక్కువసేపు మైదానంలో చెమటోడుస్తూ కనిపించాడు. జట్టు సభ్యులలో అత్యధిక సమయం సాధన చేసిన ఆటగాళ్లలో అతను ఒకడిగా నిలిచాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌తో కలిసి అక్షర్‌ ప్రత్యేకంగా ప్రాక్టీస్‌ చేశాడు. అతని స్థానంలో ఆడిన వాషింగ్టన్‌ సుందర్‌ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో సుందర్‌ను పక్కనపెట్టి అక్షర్‌కు అవకాశం ఇవ్వడం అనివార్యంగా కనిపిస్తోంది.

Advertisement