Page Loader
యూఎస్‌ ఓపెన్‌లో దుమ్మురేపిన కోకో గౌఫ్.. 19 ఏళ్లకే తొలి గ్రాండ్​స్లామ్ కైవసం
19 ఏళ్లకే తొలి గ్రాండ్​స్లామ్ టైటిల్

యూఎస్‌ ఓపెన్‌లో దుమ్మురేపిన కోకో గౌఫ్.. 19 ఏళ్లకే తొలి గ్రాండ్​స్లామ్ కైవసం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 10, 2023
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా యువ సంచలనం, కోకో గౌఫ్ తొలి గ్రాండ్​స్లామ్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగా సెరెనా విలియమ్స్ తర్వాత గుర్తింపు సాధించారు. శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్‍లో బెలారస్‍కు చెందిన ప్ర‌పంచ రెండో సీడ్ అరీనా సబలెంకాను కోకో గౌఫ్ ఓడించారు. దాదాపు 2గంటల 6నిమిషాల పాటు జరిగిన సాగిన మ్యాచ్‍లో అరీనా సబలెంకాను 2-6, 6-3, 6-2 పాయింట్ల తేడాతో మట్టికరిపించారు. గత ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో అడుగుపెట్టిన 19ఏళ్ల స్టార్ ప్లేయర్, సొంతగడ్డపై జరిగిన మెగా టోర్నీలో విజృభించారు. ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెడుతూ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఒడిసిపట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూఎస్ ఓపెన్ టెన్నీస్ ట్వీట్