
SRH: వరుస ఓటములు.. ప్లేఆఫ్స్ రేసులో సన్‌రైజర్స్‌కు ఆశలు ఉన్నాయా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. కానీ చివరి అంకంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకుంది.
ఈ క్రమంలో 2025 సీజన్‌లో ట్రోఫీ గెలుచడమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మంచి శుభారంభం చేసింది. రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేస్తూ భారీ విజయం సాధించింది.
కానీ ఆ తర్వాతి మూడు మ్యాచుల్లో వరుస పరాజయాలు చవిచూసింది.
లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా సన్‌రైజర్స్ జట్టు సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి.
Details
పాయింట్ల పట్టికలో చివరి స్థానం
ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్, కేవలం ఒకదాంట్లో గెలిచి మిగతా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. నెట్ రన్‌రేట్ -1.612 కాగా, పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరుకుంది.
వ్యూహంలో మార్పు అవసరం
రాజస్థాన్‌పై 286 పరుగులు సాధించడం ద్వారా ఈ సీజన్‌లో SRH 300 పరుగులు చేయగలదని అభిమానులు ఆశించారు. కానీ, ప్రతి బ్యాటర్ హిట్టింగ్ మోడ్‌లోనే ఉండటం జట్టుకు ఇబ్బందిగా మారింది.
వరుస ఓటముల నుంచి బయటపడకపోతే ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరడం కష్టమే.
Details
ప్లేఆఫ్స్ చేరాలంటే..?
సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో ఇంకా 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
గత సీజన్ల గణాంకాలను తీసుకుంటే, 8 విజయాలు సాధించిన జట్లు ప్లేఆఫ్స్‌కి చేరే అవకాశం ఎక్కువ. అంటే హైదరాబాద్ మిగిలిన 10 మ్యాచ్‌ల్లో కనీసం 7 గెలవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జట్టు ఫామ్ అంత బాగోలేకపోయినా టోర్నీ ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి వ్యూహాన్ని మార్చుకుంటే గెలుపు అవకాశాలు ఉంటాయి.